పిల్లలకు చదువొక్కటే కాదు...వాటికి తోడు ఆట పాటలుంటే భవిష్యత్ ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈవిషయాన్ని నిరూపిస్తున్నారు హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు. పేదరికాన్ని జయించేందుకు ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి గురుకులంలో అడుగుపెట్టిన ఆ విద్యార్థులంతా...పసి ప్రాయంలోనే తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందుకు వేదికగా నిలిచింది ఆసు యంత్ర సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం. ఆయన జీవిత కథలో భాగస్వాములయ్యే అదృష్టాన్ని దక్కించుకున్న గురుకుల పాఠశాల విద్యార్థులు...చక్కటిప్రదర్శనతో యావత్ ప్రేక్షక లోకానికి బాల్యస్మృతులను గుర్తు చేశారు. తెలంగాణ మొత్తం జల్లెడ పట్టినా మల్లేశం చిత్రానికి సరిపోయే బాల నటీనటులు దొరకని పరిస్థితుల్లో..ఆ అవకాశాన్ని దక్కించుకొని శభాష్ అనిపించుకున్నారు. తొలిసారిగా వెండితెరపై మెరిసి లలితకళల పాఠశాల లక్ష్య సాధనలో తొలివిజేతలుగా నిలిచారు.
0 Comments